- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రికార్డులు తిరగరాస్తున్న ‘ఆయా షేర్’ సాంగ్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయంటే?
‘ది ప్యారడైజ్’ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట ‘ఆయా షేర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది.

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని(nani), మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘దసరా’ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట ‘ఆయా షేర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ పాట విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాను ఊపేస్తోంది. కేవలం 6 రోజుల్లోనే ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ నంబర్ 1 స్థానానికి చేరుకోవడమే కాకుండా, ఏకంగా 42 మిలియన్ల వ్యూస్ రాబట్టిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
నాని మాస్ మేకోవర్, అనిరుధ్ బీట్స్ తోడవ్వడంతో ఈ సాంగ్ ఒక గ్లోబల్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా కోసం నాని మునుపెన్నడూ లేని విధంగా తన లుక్‌ను మార్చుకున్నారు. కఠినమైన వర్కౌట్స్ చేసి సిక్స్ ప్యాక్ బాడీని పెంచుకోవడమే కాకుండా, గుబురు జుట్టు, గడ్డంతో పూర్తి రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇందులో నాని ‘జడల్’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన మేకోవర్ చూస్తుంటే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల మార్క్ మేకింగ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని సరసన కాయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మంచు మోహన్ బాబు ఒక కీలక పాత్రలో కనిపిస్తుండటం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.






