- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సూర్య-46’ సినిమా షూటింగ్ పూర్తి.. విడుదల విషయంలో మాస్టర్ ప్లాన్ వేసిన మేకర్స్
కోలీవుడ్ కింగ్ సూర్య(suriya) వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం వరుసబెట్టి ప్రాజెక్టులు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.

దిశ, సినిమా: కోలీవుడ్ కింగ్ సూర్య(suriya) వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం వరుసబెట్టి ప్రాజెక్టులు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఫుల్ స్పీడ్‌లో ఉన్న సూర్య టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ‘సూర్య-46’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతుండగా.. ఇందులో సూర్య సరసన మలయాళ బ్యూటీ మమిత బైజు(Mamitha Baiju) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సాయి సౌజన్య, నాగవంశీ నిర్మిస్తున్నారు.
ఇక మేకర్స్ ఒక పక్కా ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారని టాక్. వెంకీ అట్లూరీ గత సినిమాల ట్రాక్ రికార్డ్ చూస్తూ.. ఈ సారి కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ‘సూర్య-46’ ఉంటాయని అర్థమవుతోంది. తాజాగా, మూవీ మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. షూటింగ్ పూర్తి అయినట్లు తెలుపుతూ.. కొన్ని ఫొటోలను షేర్ చేశారు. ఇక త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టేందుకు టీమ్ రెడీ అవుతోందని తెలుస్తోంది.
ఇక ఈ మూవీతో వెంకీ తన సక్సెస్ ట్రాక్‌ని కంటిన్యూ చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడట. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లు రానున్నాయట. ఇక ఈ చిత్రాన్ని మూవీ మేకర్స్ వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా మే 1న తీసుకురావాలనే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. సమ్మర్ వరకి అన్ని చిత్రాలు విడుదల అవుతాయి.. సింగిల్‌గా వచ్చి హిట్ అందుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.






