- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘బోర్డర్-2’ షూటింగ్ పూర్తి.. ఎప్పటికీ మర్చిపోలేని జర్నీ అంటూ హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan), మేధా రానా(Medha Rana) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘బోర్డర్-2’(Border-2).

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan), మేధా రానా(Medha Rana) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘బోర్డర్-2’(Border-2). ఈ సినిమాకు అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. జెపి ఫిల్మ్స్, టి సిరీస్ బ్యానర్స్‌పై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, జెపి దత్తా, నిధి దత్తా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద హిట్ అయిన ‘బోర్డర్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో దిల్జిత్ దోసాంజ్, నితీష్ నిర్మల్, అహన్ శెట్టి, వినాలి భట్నాగర్, సన్నీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. 199లో కార్గిల్ యుద్ధం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 23న థియేటర్స్‌లో రాబోతుంది.
తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు మూవీ మేకర్స్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. మూవీ టీమ్ అంతా కలిసి ‘బోర్డర్-2’ సెట్‌లో కేక్ కట్ చేసి అంతా తినిపించుకున్నారు. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ మేధారానా ఇన్‌స్టా ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘ఈ మరపురాని ప్రయాణంలో నన్ను భాగం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ జర్నీని ఎప్పటికీ మర్చిపోలేను నాకు ఇది చాలా స్పెషల్. ‘బోర్డర్-2’ టీమ్‌కు కృతజ్ఞురాలిని మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. వరుణ్, అనురాగ్, ముఖేష్ అందరికీ స్పెషల్ థాంక్స్’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు సూపర్ ఎక్జైటెడ్‌గా ఉన్నామని కామెంట్లు పెడుతున్నారు.






