అమ్మాయిల పర్సనల్ వీడియో షేర్ చేసిన సీరియల్ నటి.. తిట్టిపోస్తున్న నెటిజన్లు

by Disha Web Desk 7 |
అమ్మాయిల పర్సనల్ వీడియో షేర్ చేసిన సీరియల్ నటి.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: యాక్టర్ కస్తూరి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న కస్తూరి.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. సమాజంలో జరిగే వివాదాలు, సమస్యలపై స్పందిస్తూ అప్పుడప్పుడు కాంట్రవర్శికి గురవుతుంటుంది. ఈ క్రమంలోనే మరోసారి నెట్టింట ట్రోల్స్ ఎదుర్కొంటుంది ఈ నటి.

తాజాగా కస్తూరి తన ట్విట్టర్ అకౌంట్‌లో ఓ పోస్ట్ షేర్ చేశారు. అందులో ఇద్దరు అమ్మాయిలు మద్యం దుకాణం వద్ద బీర్లు కొంటున్నారు. దానికి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ.. ‘‘బాగా తాగండి అమ్మాయిలు’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది కస్తూరి. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ కావడంతో.. ‘‘ఇది అమ్మాయిల వ్యక్తిగత విషయం. దీన్ని షేర్ చేయాల్సిన అవసరం ఏముందని.. అమ్మాయిలు మందు తాగడాన్ని ఎంకరేజ్ చేస్తున్నావా?’’ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే ఉన్నత కుటుంబాలకు చెందిన అమ్మాయిల వీడియోలైతే ఇలాగే షేర్ చేసే దమ్ముందా అంటూ మండిపడుతున్నారు. ఇదే పోస్ట్‌పై సింగర్ చిన్మయి శ్రీపాద కూడా రియాక్ట్ అవుతూ.. ‘‘నిజాయితీగా చెప్పాలంటే ఇలాంటి వీడియో షేర్ చేయాల్సిన అవసరం లేదంటూ’’ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Next Story