- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రొమాంటిక్ మెలోడీ ‘ఏదో ఏదో’ సాంగ్ విడుదల..
‘లూసియా’ ఫేమ్ సతీష్ నినాసం హీరోగా, నిర్మాతగా భారీ ఎత్తున రూపొందిస్తున్న చిత్రం ‘ది రైజ్ ఆఫ్ అశోక’(The Rise of Ashoka).

దిశ, సినిమా: ‘లూసియా’ ఫేమ్ సతీష్ నినాసం హీరోగా, నిర్మాతగా భారీ ఎత్తున రూపొందిస్తున్న చిత్రం ‘ది రైజ్ ఆఫ్ అశోక’(The Rise of Ashoka). ఈ సినిమాని వృద్ధి క్రియేషన్, సతీష్ పిక్చర్ హౌస్ బ్యానర్ల మీద వర్ధన్ హరి, జైష్ణవి, సతీష్ నినాసం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీకి వినోద్ వి ధోండలే (Vinod V Dhondale)దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సతీష్ నినాసంకి జోడిగా సప్తమి గౌడ (Sapthami Gowda)నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, తాజాగా రిలీజ్ చేసిన పవర్ ఫుల్ సాంగ్ ‘వినరా మాదేవ’ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ప్రేమ జంటను కట్టి పడేసేందుకు ఓ మంచి రొమాంటిక్ మెలోడీతో టీం ముందుకు వచ్చింది.
తాజాగా ‘ది రైజ్ ఆఫ్ అశోక’ నుంచి ‘ఏదో ఏదో’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటను వింటే హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, వారి అనుబంధం, కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అర్థం అవుతోంది. ఇక వీడియో సాంగ్ మొత్తాన్ని రిలీజ్ చేయడంతో.. పాటలోని అందమైన లొకేషన్లు, హీరో హీరోయిన్ల పాత్ర తీరు మొత్తాన్ని చూపించినట్టు అయింది. ఇందులో సతీష్, సప్తమీ గౌడ జంట చూడముచ్చటగా ఉంది. ఈ పాటకు తగ్గట్టుగా వారి స్టెప్పులు, లుక్స్ అన్నీ కూడా అద్భుతంగా కుదిరాయి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అన్ని పనుల్ని పూర్తి చేసుకుని ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.






