‘ఫంకీ’ మూవీ విడుదల వాయిదా.. కొత్త డేట్ అనౌన్స్ చేస్తూ గుడ్ న్యూస్ చెప్పిన మూవీ మేకర్స్ (పోస్ట్)

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-15 11:32:49  IST  )

తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ దక్కించుకున్న మాస్ కా దాస్ విశ్వక్‌సేన్(Vishwak Sen) ‘ఫంకీ’(Funky) చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

‘ఫంకీ’ మూవీ విడుదల వాయిదా.. కొత్త డేట్ అనౌన్స్ చేస్తూ గుడ్ న్యూస్ చెప్పిన మూవీ మేకర్స్ (పోస్ట్)
X

దిశ, సినిమా: తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ దక్కించుకున్న మాస్ కా దాస్ విశ్వక్‌సేన్(Vishwak Sen) ‘ఫంకీ’(Funky) చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు అనుదీప్(Anudeep) తెరకెక్కిస్తున్నారు. ఈసారి రెట్టింపు నవ్వులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. ‘జాతిరత్నాలు’ మూవీతో సంచలనం సృష్టించిన ఆయన మరోసారి.. విభిన్న కథాంశం, కట్టిపడేసే హాస్యంతో రాబోతున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌పై నాగవంశీ, సాయి సౌజన్య అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కోలీవుడ్ బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం విడుదల వాయిదా పడినట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. షూట్ ఆలస్యం కారణంగా సమ్మర్ స్పెషల్‌గా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్.. మాస్ కా దాస్ అభిమానులకు గుడ్ న్యూస్ ప్రకటించారు. ‘ఫంకీ’ సినిమా రెండు నెలల ముందుగానే.. వాలెంటైన్స్ డే సందర్భంగా.. ఫిబ్రవరి 13న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు.

ఉల్లాసభరితమైన, సరదా అనుభవాన్ని పొందేందుకు మీ టికెట్ బుక్ చేసుకోండి. ఫిబ్రవరి 13న ‘ఫంకీ’మీ ముందుకు వస్తోంది. అందరికీ పిచ్చి ఆనందాన్ని.. 100శాతం వినోదాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా కయాదు లోహర్, విశ్వక్ సేన్ క్రేజీ పోస్టర్‌ను షేర్ చేసి క్యూరియాసిటీని పెంచారు. ఇక ఈ పోస్ట్ చూసిన సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.

Next Story