‘ది ప్యారడైజ్’ సినిమా విడుదల వాయిదా.. అధికారిక ప్రకటనతో క్లారిటీ ఇచ్చిన మేకర్స్

by Mallepaka Hamsa |

మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతున్న నేపథ్యంలో.. స్టార్ హీరో చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

‘ది ప్యారడైజ్’ సినిమా విడుదల వాయిదా.. అధికారిక ప్రకటనతో క్లారిటీ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతున్న నేపథ్యంలో.. స్టార్ హీరో చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ కానుకగా.. ప్రభాస్,చిరంజీవి, రవితేజ వంటి స్టార్స్ నటించిన భారీ సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ఇక వచ్చే ఏడాది మార్చి నెలలో రెండు భారీ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’, నాని(nani) హీరోగా రాబోతున్న ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీసు వద్ద పోటీపడనున్నాయి. ఇక ఈ రెండు చిత్రాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నాని, శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) కాంబోలో రాబోతున్న ‘ది ప్యారడైజ్’(The Paradise) వచ్చే ఏడాది థియేటర్స్‌లోకి రాబోతుంది.

షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే పలు అప్డేట్స్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. కాగా..ఈ మూవీ ఏకంగా 8 భాషల్లో విడుదల కాబోతున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 26న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, స్పానిష్, ఇంగ్లీష్, బెంగాళి భాషల్లో అందుబాటులోకి రానుంది. కానీ ఈ సినిమా షూటింగ్ కారణంగా వాయిదా పడనున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మే నెలలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో వాటిని చూసిన నాని అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

ఈక్రమంలోనే.. తాజాగా, చిత్రబృందం ‘ది ప్యారడైజ్’ వాయిదా పడటం స్పందించి క్లారిటీ ఇచ్చారు. నేడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పుట్టినరోజు కావడంతో సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ‘ది ప్యారడైజ్’ అనుకున్న విధంగానే మార్చి 26 రాబోతుంది.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నాని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే షూటింగ్ పనులు కూడా పూర్తి కాబోతున్నాయని సమాచారం. అంతేకాకుండా వచ్చే ఏడాది నుంచి ప్రమోషన్స్‌లో భాగంగా వరుస అప్డేట్స్ కూడా రాబోతున్నట్లు టాక్.

link

Next Story