- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ram Charan: బాబాయ్ కోసం వెనక్కి తగ్గిన అబ్బాయ్.. కొత్త తేదీ అనౌన్స్ చేసి షాకిచ్చిన బుచ్చిబాబు
రామ్ చరణ్ (Ram Charan)పుట్టినరోజు కానుకగా మార్చి 27న విడుదల కావాల్సిన ‘పెద్ది’ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు బుచ్చిబాబు అధికారికంగా ప్రకటించారు.

దిశ, సినిమా: రామ్ చరణ్ (Ram Charan)పుట్టినరోజు కానుకగా మార్చి 27న విడుదల కావాల్సిన ‘పెద్ది’ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు బుచ్చిబాబు అధికారికంగా ప్రకటించారు. దీనికి ప్రధాన కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అని తెలుస్తోంది. ఈ క్రేజీ మాస్ ఎంటర్టైనర్‌ను మార్చి 26న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేశారు. బాక్సాఫీస్ వద్ద బాబాయ్-అబ్బాయ్ పోటీ పడటం మెగా అభిమానులకు ఇష్టం ఉండదని భావించిన రామ్ చరణ్, బాబాయ్ సినిమా కోసం తన రిలీజ్ డేట్‌ను స్వచ్ఛందంగా వాయిదా వేసుకున్నట్లు టాక్. ఒకే ఇంట్లోని ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు కేవలం ఒక్క రోజు వ్యవధిలో వస్తే థియేటర్ల దగ్గర గొడవలు జరగడమే కాకుండా, కలెక్షన్లపై కూడా దెబ్బ పడుతుందని రామ్ చరణ్ భావించారు.
అందుకే, బాబాయ్ సినిమాకు లైన్ క్లియర్ చేసి.. అబ్బాయ్ తన సినిమాను ఏప్రిల్ 30కి షిఫ్ట్ చేసుకున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కొందరు షాక్ అవుతుంటే.. మరికొందరు రామ్ చరణ్ చేసిన త్యాగాన్ని మెచ్చుకుంటున్నారు. ఇక ఏప్రిల్ 30న ‘పెద్ది’ (Peddi)రాబోతుండటంతో రెండు నెలల పాటు మెగా జాతర కొనసాగనుంది. అంతేకాకుండా, రామ్ చరణ్-ఉపాసన దంపతులకు ఇటీవల కవల పిల్లలు (ఒక పాప, ఒక బాబు) జన్మించడంతో మెగా కుటుంబంలో వేడుకలు అంబరాన్నంటాయి. పిల్లలతో సమయం గడపడం కోసం కూడా చరణ్ షూటింగ్ నుండి చిన్న విరామం తీసుకున్నట్లు సమాచారం. కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ‘అచ్చమ్మ’ అనే పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని ‘చికిరి చికిరి’ సాంగ్ మిలియన్ల వ్యూస్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ చెప్పడాన్ని నేర్చుకోవడం విశేషం. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా నిలవబోతోంది. రామ్ చరణ్ తన పుట్టినరోజు నాడే (మార్చి 27) బాబాయ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ అవుతుండటంతో పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏప్రిల్ 30న సమ్మర్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ వంటి దిగ్గజ నటులు ఇందులో కీలక పాత్రలు కనిపించబోతుండతో ‘పెద్ది’పై పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ నెలాఖరున ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అంతా చర్చించుకుంటున్నారు.






