1134 Movie: నో బడ్జెట్‌ మూవీ ‘1134’ విడుదల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

by Phanindra |

కొత్త కాన్సెప్ట్‌లు, ప్రయోగాత్మక సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు

1134 Movie: నో బడ్జెట్‌ మూవీ ‘1134’ విడుదల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: కొత్త కాన్సెప్ట్‌లు, ప్రయోగాత్మక సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అలాంటి ఒక డిఫరెంట్ ప్రయోగాత్మక చిత్రమే ‘1134’. చూస్తుంటే ఈ టైటిల్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ద్వారా నూతన దర్శకుడు శరత్ చంద్ర తడిమేటి పరిచయం అవుతున్నాడు. ఇదొక షూస్ట్రింగ్ బడ్జెట్ మూవీ. అంటే, చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్‌తో.. అసలు ఈ డబ్బులతో ఒక సినిమా తీయలేము అనుకునేంత తక్కువ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు. అందుకే దీన్ని నో బడ్జెట్ సినిమా అని పిలుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఇండస్ట్రీలోని చాలా మంది నుంచి ప్రశంసలు అందుకుంది. 2 నిమిషాల 28 సెకనుల నిడివితో వచ్చిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. సొంతంగా తనే కథ రాసుకొని హై టెక్నికల్ వాల్యూస్‌తో అన్నివర్గాల ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలా ఈ సినిమాను తెరకెక్కించారట డైరెక్టర్ శరత్ చంద్ర తడిమేటి. మొత్తానికి ఈ డిసెంబర్ 15న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

Next Story