- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మైసా’ స్పెషల్ గ్లింప్స్‌కు ముహూర్తం ఫిక్స్.. పవర్ ఫుల్ పోస్టర్ విడుదల
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ‘పుష్ప 2’ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఆమె నుంచి రాబోతున్న మరో భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ (Mysaa).

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ‘పుష్ప 2’ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఆమె నుంచి రాబోతున్న మరో భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ (Mysaa). ఈ సినిమాతో రవీంద్ర పూలే (Ravindra Pule)దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతుండటం విశేషం. ఇక ఇప్పటికే ఇందులోంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రష్మిక ముఖంపై రక్తపు మరకలతో, చేతిలో ఆయుధం పట్టుకుని చాలా ఇంటెన్స్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘ఆమె గర్జన వినడానికి కాదు.. భయపెట్టడానికి’ అనే ట్యాగ్ లైన్ సినిమాలోని యాక్షన్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో తెలిసేలా చేసింది. అయితే ఈ చిత్రం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో నివసించే 'గోండు' తెగల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందని సమాచారం. గోండు తెగల జీవన విధానం, వారి సాంప్రదాయాలు, కష్టాలు, పేదరికం, హక్కుల కోసం చేసే పోరాటం లాంటివన్నీ సినిమాలో అత్యంత రియలిస్టిక్‌గా చూపించనున్నారట.
హక్కుల కోసం పోరాడే ఒక వీరనారిగా, పవర్‌ఫుల్ మదర్ క్యారెక్టర్‌లో రష్మిక కనిపించబోతున్నట్లు టాక్. నేషనల్ క్రష్ ఇంత వరకు ఇలాంటి రఫ్ అండ్ రగ్గడ్ పాత్ర చేయడం ఇదే మొదటిసారి కావడంతో, ఆమె ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇండస్ట్రీ మొత్తం కూడా ఆసక్తిగా ఈ సినిమా వైపు చూస్తోంది. రష్మిక పాత్ర కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు ఇన్సైడ్ టాక్. షూటింగ్ మొత్తం తెలంగాణ అడవులు, నిజామాబాద్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో జరగనుంది. సినిమా లొకేషన్స్ రియల్ వైబ్ ఇవ్వడానికి అక్కడి గిరిజన గ్రామాల్లో సెట్స్ వేయకుండా నేరుగా నేచర్‌లో షూట్ చేయబోతున్నారట. ఇక ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను డిసెంబర్ 24, 2025న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఇక ఇందులో రష్మిక చాలా పవర్ ఫుల్ లుక్‌లో కనిపించింది.






