‘బ్యాడ్ గర్ల్స్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా అంటున్న డైరెక్టర్

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-13 07:42:37  IST  )

అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి(Roshini), యష్ణ, రోహన్,పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘బ్యాడ్ గర్ల్స్’(Bad Girls).

‘బ్యాడ్ గర్ల్స్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా అంటున్న డైరెక్టర్
X

దిశ, సినిమా: అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి(Roshini), యష్ణ, రోహన్,పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘బ్యాడ్ గర్ల్స్’(Bad Girls). ఇందులో రేణు దేశాయ్(Renu Desai) కూడా కీలక పాత్రలో కనిపించనుండటం విశేషం. చాలా రోజుల తర్వాత ఈ చిత్రంతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇవ్వనుంది. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వంలో వస్తుంది. ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నారు చిత్ర యూనిట్.

ఈ సందర్భంగా.. దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి మాట్లాడుతూ ‘‘మా ‘బ్యాడ్ గర్ల్స్’ పూర్తి ఎంటర్టైనర్ చిత్రం. జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి మూవీ ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మా చిత్రాన్ని క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నాం. అనూప్ రూబెన్స్ గారు మంచి సంగీతం అందించగా ఆస్కార్ చంద్ర బోస్ గారు అని పాటలకు లిరిక్స్ అందించారు. పాటలు చాలా బాగా వచ్చాయి.

ఇటీవల విడుదలైన ‘ఇలా చూసుకుంటానే’ పాటకు మంచి ఆదరణ లభించింది, యూట్యూబ్ లో 6 మిలియన్ వ్యూస్ తో దుసుకుపోతుంది. అలాగే ఇటీవల విడుదల అయినా ‘బ్యాడ్ గర్ల్స్’ టైటిల్ సాంగ్‌కి మంచి ఆదరణ లభిస్తుంది. మిగతా పాటలు, టీజర్, ట్రైలర్ త్వరలో విడుదల చేస్తాం. డిసెంబర్ 25న విడుదల అవుతుంది తప్పక చూడండి’’ అని తెలిపారు. కాగా.. క్రిస్మస్ కానుకగా స్టార్ హీరోల చిత్రాలెన్నో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక వాటితో ‘బ్యాడ్ గర్ల్స్’ పోటీ పడబోతుంది.

Next Story