- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీరియస్ లుక్ వెనుక అసలు నిజం.. మహేష్ వివాదంపై శ్రీలీల క్లారిటీ!
ఈవెంట్ జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక వింత ‘బీప్’ సౌండ్ వినిపించింది. అది ఎక్కడి నుండి వస్తుందో అని నేను వెనక్కి తిరిగి చూశాను.

దిశ, సినిమా: సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా వైరల్ అవుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్ వివాదంపై టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ఎట్టకేలకు స్పందించారు. సహ నటుడు మహేష్‌పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా ఉన్న వీడియో క్లిప్పింగ్స్‌పై క్లారిటీ ఇస్తూ, అదంతా కేవలం ఒక మిస్ అండర్‌స్టాండింగ్ అని కొట్టిపారేశారు. ఇటీవల జరిగిన ఒక సినీ వేడుకలో శ్రీలీల, మహేష్ వైపు సీరియస్‌గా చూస్తున్నట్లు ఉన్న వీడియోలు నెటిజన్ల విమర్శలకు దారితీశాయి. దీనిపై శ్రీలీల వివరణ ఇస్తూ.. "ఈవెంట్ జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక వింత ‘బీప్’ సౌండ్ వినిపించింది. అది ఎక్కడి నుండి వస్తుందో అని నేను వెనక్కి తిరిగి చూశాను. అదే సమయంలో నా ఫోన్ మహేష్ దగ్గర ఉందన్న విషయం గుర్తొచ్చి, ఫోన్ కోసమని ఆయన వైపు చూశాను" అని తెలిపారు.
ఆ సమయంలో మహేష్ తన ఫోన్‌ను భద్రంగా పట్టుకుని తనకు సహాయం చేశారని, తామిద్దరం కేవలం సైగలతో మాత్రమే మాట్లాడుకున్నామని ఆమె స్పష్టం చేశారు. "నేను ఫోన్ కోసం చూశాను, ఆయన కూడా నేను ఫోన్ కోసమే చూస్తున్నానని అర్థం చేసుకున్నారు. ఇందులో ఎలాంటి వివాదం లేదు. మా మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణాన్ని అపార్థం చేసుకుని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కొన్ని సెకన్ల వీడియో క్లిప్పింగ్స్ ఆధారంగా ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని జడ్జ్ చేయడం సరైంది కాదని శ్రీలీల పేర్కొన్నారు. "నిజం తెలియకుండా ఇతరులను ఇబ్బంది పెట్టకండి. సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఏదైనా ఇష్యూ ఉంటే మేమే నేరుగా చెబుతాం" అంటూ ఆమె ఈ వివాదానికి చెక్ పెట్టారు.






