- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాక్సాఫీసు వద్ద ‘ది రాజాసాబ్’ సునామీ.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ‘ది రాజాసాబ్’ (The Rajasaab)బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ‘ది రాజాసాబ్’ (The Rajasaab)బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. విడుదలైన తొలిరోజు కొంతమంది నుంచి మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ, ప్రభాస్ ఓల్డ్ లుక్స్ రివీల్ అయిన తర్వాత సినిమా మీద ఒక్కసారిగా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన రావడంతో కలెక్షన్లు గట్టిగా పెరిగాయి. ఓపెనింగ్ డే నాడు ఈ సినిమా సుమారు రూ. 45 కోట్ల వసూళ్లను రాబట్టగా, ప్రీమియర్స్ కలుపుకుని మొత్తం రూ. 54 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు రూ. 90 కోట్ల గ్రాండ్ ఓపెనింగ్ నమోదు చేసి ప్రభాస్ మార్కెట్ పవర్‌ను మరోసారి నిరూపించింది.
రెండో రోజు కూడా నిలకడగా వసూళ్లు సాధించిన ‘ది రాజాసాబ్’ మూడో రోజుకు వచ్చేసరికి మరింత పుంజుకుంది. వీకెండ్ అడ్వాంటేజ్‌తో థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలు కొనసాగాయి. ఈ క్రమంలో మూడు రోజుల్లోనే సినిమా రూ. 183 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ అభిమానుల్లో జోష్ నింపారు. హారర్–కామెడీ ఎలిమెంట్స్‌తో పాటు ప్రభాస్ స్టైలిష్ ప్రెజెన్స్, మాస్ మోమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ పాత లుక్‌లో కనిపించిన సీన్స్‌కు థియేటర్లలో విజిల్స్, క్లాప్స్ పడుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ట్రెండ్ కొనసాగితే, రాబోయే రోజుల్లో ‘ది రాజాసాబ్’ మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.






