- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరో అవుతానంటే పనికి మాలిన కలలు అవసరమా అని అన్నారు.. శివ కార్తీకేయన్ షాకింగ్ కామెంట్స్
తమిళ స్టార్ హీరో శివ కార్తీకేయన్(Siva Karthikeyan) ‘అమరన్’ (Amaran)తన పాపులారిటీని మరింత పెంచుకున్నారు.

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో శివ కార్తీకేయన్(Siva Karthikeyan) ‘అమరన్’ (Amaran)తన పాపులారిటీని మరింత పెంచుకున్నారు. వరుస సినిమాల్లో నటిస్తూ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్నారు. ప్రస్తుతం ‘పరాశక్తి’ (Parashakti)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సుధకొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో భాగంగా జనవరి 14న విడుదల కాబోతుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివ కార్తీకేయన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన ఓ సంఘటను గుర్తు చేసుకుంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో దర్శకనిర్మాత కేఎస్. సినీశ్ ఆఫీసుకి వెళ్లాను. నన్ను చూడగానే.. ఇండస్ట్రీకి వచ్చి ఏం చేస్తావ్ అని అన్నారు. దీంతో నేను ‘వెట్టయి మన్నన్’ సినిమాలో కామెడీ రోల్ చేస్తున్నా.. హీరో అవ్వాలని కలలు కనలేదు.
కానీ ఏదో ఒకరోజు అదృష్టం కలిసొచ్చే కచ్చితంగా హీరో అవుతా అన్నాను. దీంతో ఆ మాటలు విన్న ఆయన ఇలాంటి పనికిమాలిన కలలు ఎందుకు కంటున్నావ్? కామెడీ బాగా చేస్తున్నావ్ అలాంటి రోల్స్ చేసుకో అన్నారు. నాకు చాలా బాధ అనిపించింది. హీరో ఎందుకు కాకూడదని అని అడిగా. అప్పుడు నాకు ఓ డ్యాన్సర్‌ను చూపించి ఆయన హీరో అవుడేమో కానీ నువ్వు మాత్రం కాలేవని అన్నారు. అదంతా అప్పుడే మర్చిపోయినప్పటికీ ఇటీవల ఆయన ఓ సినిమా షూట్‌లో బిజీగా ఉన్న సమయంలో కాల్ చేశారు. కానీ నేను సరిగ్గా మాట్లాడలేకపోయాను. నా మీద కోపంగా ఉందా? అని అడిగారు. అతను ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాడేమో?’’ అని అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






