‘లెనిన్’ సినిమా నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. థియేటర్స్‌లోకి ఎప్పుడు రానుందంటే?

by Mallepaka Hamsa |

రెండేళ్ల తర్వాత అక్కినేని అఖిల్ (Akkineni Akhil)మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

‘లెనిన్’ సినిమా నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత..  థియేటర్స్‌లోకి ఎప్పుడు రానుందంటే?
X

దిశ, సినిమా: రెండేళ్ల తర్వాత అక్కినేని అఖిల్ (Akkineni Akhil)మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సారి హిట్ సాధించాలనే కసితో.. త్వరలో ‘లెనిన్’ (Lenin)సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘వినరో భాగ్యం విష్ణు కథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి(Murali Kishore Abburi) దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. కొన్ని సీన్స్ చేసిన తర్వాత ఆమెను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. పలు కారణాల వల్ల ఆమె ప్లేస్‌లోకి భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక ఇప్పటికే వచ్చిన గ్లింప్స్‌తో అఖిల్ మాస్ పాత్రలో కనిపించబోతున్నారని అర్థమైంది. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం గమనార్హం. భారీ అంచనాల మధ్య రాబోతున్న ‘లెనిన్’ అప్డేట్స్ కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా, ‘లెనిన్’ నిర్మాత నాగవంశీ అక్కినేని అభిమానులకు డబుల్ గుడ్ న్యూస్ చెప్పారు. మా సినిమా చాలా బాగా వస్తుంది. వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయాలని భావిస్తున్నామని తెలిపారు. అలాగే.. త్వరలోనే ఫస్ట్ సింగిల్‌ను కూడా రిలీజ్ చేయనున్నామని అన్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా రాబోతుందని చెప్పిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మార్చి నెలలో మరో రెండు భారీ ప్రాజెక్ట్స్ విడుదల సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. నాని ‘ది ప్యారడైజ్’తో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ మార్చిలో రిలీజ్ కాబోతున్నాయి. ఇక ‘లెనిన్’ అదే నెలలో విడుదల కాబోతున్నట్లు నిర్మాత చెప్పడంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. నాని, రామ్ చరణ్‌తో పోటీ పడి అఖిల్ విజయం సాధిస్తాడా? లేక మళ్లీ ఫ్లాప్స్‌తో ఇండస్ట్రీకి దూరం అవుతాడా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Next Story