ICUలో తారకరత్న.. లేటెస్ట్ ఫొటో వైరల్

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-01-31 09:47:57  IST  )

నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురైన తారకరత్న ఇంకా క్రిటికల్ పరిస్థితిలోనే చికిత్స పొందుతున్నారు.

ICUలో తారకరత్న.. లేటెస్ట్ ఫొటో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురైన తారకరత్న ఇంకా క్రిటికల్ పరిస్థితిలోనే చికిత్స పొందుతున్నారు. బెంగళూరులోని నారాయణ ఆస్పత్రిలో తారక రత్నకు అత్యన్నత చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన విషమ పరిస్థితుల్లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. అయితే తారక రత్న ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి మీడియాకు హెల్త్ బులిటెన్‌ను రిలీజ్ చేస్తున్నారే తప్పా.. ఆయన తాజా ఫొటోలను విడుదల చేయలేదు. కానీ మంగళవారం ఉదయం తారక రత్న ఐసీయూలో బెడ్‌పై చికిత్స పొందుతున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

READ MORE

చిరు చేతుల మీదుగా గ్రాండ్‌గా లాంచ్ అయిన #Nani30

Next Story