- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను ఆరాధించే వ్యక్తి నా జీవితంలో ఒక భాగమయ్యారు.. లవ్ సింబల్ యాడ్ చేస్తూ స్టార్ హీరోపై మాళవిక ఇంట్రెస్టింగ్ పోస్ట్
మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) ‘పట్టంపోల్’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి వచ్చింది.

దిశ, సినిమా: మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) ‘పట్టంపోల్’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి వచ్చింది. ఈ అమ్మడు చేసింది తక్కువ చిత్రాలే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తమిళ స్టార్ హీరోలు విజయ్, సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన నటించి ఫేమ్ సంపాదించుకుంది. ఇక గత ఏడాది ‘తంగలాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ (The Rajasaab)మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మారుతి తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్రింద టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ఇక ఇందులో మాళవికతో పాటు నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ధి కుమార్(Riddhi Kumar) నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మాళవిక షూటింగ్‌లో పాల్గొంటూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా, ఈ అమ్మడు ఓ స్టార్ హీరోకు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఫొటో షేర్ చేస్తూ.. ‘‘నా జీవితంపై చాలా ప్రభావాన్ని చూపిన వ్యక్తిని నేను వెతుకుతున్న, అలా ఉండాలని ఆశించే వ్యక్తి ఆయన. నేను ఆరాధించే వ్యక్తి నా జీవితంలో భాగమైన తర్వాత మానిఫోల్ట్‌ను పెంచింది. పుట్టినరోజు శుభాకాంక్షలు విజయ్ సర్. నీలాంటి వాళ్లు ఇంకెవ్వరూ ఉండరు. లెక్కలేనన్ని మందితో థియేటర్లతో జన నాయగన్ జరుపుకోవడడానికి వేచి ఉండలేను’’ అని రాసుకొచ్చింది. అలాగే రెడ్ హార్ట్ సింబల్‌ను జత చేసింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.






