ఫ్యాన్స్ కు బిగ్ షాక్‌..పెద్ది, ది ప్యారడైజ్ సినిమాలు వాయిదా ?

by velandi.Saikiran |

2026 మార్చిలో నాని నటిస్తున్న ది ప్యారడైజ్ (The Paradise), అటు రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది (Peddi) ప్రేక్షకుల ముందుకు

ఫ్యాన్స్ కు బిగ్ షాక్‌..పెద్ది, ది ప్యారడైజ్ సినిమాలు వాయిదా ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. డిసెంబర్ నుంచి వచ్చే ఎండాకాలం వరకు పెద్ద హీరోల సినిమాలే రిలీజ్ కాబోతున్నాయి. ముఖ్యంగా 2026 మార్చిలో నాని నటిస్తున్న ది ప్యారడైజ్ (The Paradise), అటు రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా (Peddi) ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ది ప్యారడైజ్ సినిమా మార్చి 26వ తేదీన రిలీజ్ కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అటు పెద్ది సినిమా మార్చి 27న రిలీజ్ కానున్నట్లు బుచ్చిబాబు కూడా ప్రకటించారు. అవసరం అనుకుంటే ఒకరోజు ముందుగానే, సినిమా రిలీజ్ చేస్తామని కూడా తెలిపారు.

అయితే ఇప్పుడు ఈ విషయంలో చిత్ర బృందం కాస్త వెనుకడుగు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టేందుకు కాస్త లేటుగానే అంటే ఏప్రిల్ లో సినిమా రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అటు నాని నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ పనులు పెండింగ్ లో పడ్డాయట. అవి పూర్తి కావడానికి కాస్త సమయం పడుతుందట. అందుకే ఈ సినిమాను పోస్ట్ ఫోన్ చేసి కొత్త తేదీని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ న్యూస్ కూడా వైరల్ గా మారింది. దీంతో నాని, అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు.

Next Story