- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రజనీకాంత్‌తో మూవీ రిజెక్ట్ చేసిన ఏకైక స్టార్ హీరోయిన్..
భాషతో సంబంధం లేకుండా కోట్లలో అభిమానులను సంపాదించుకున్న స్టార్స్ లిస్ట్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు ముందు వరుసలో ఉంటుంది.

దిశ, సినిమా: భాషతో సంబంధం లేకుండా కోట్లలో అభిమానులను సంపాదించుకున్న స్టార్స్ లిస్ట్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు ముందు వరుసలో ఉంటుంది. 70 ఏళ్లు వచ్చినా.. ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నాడు అంటే ఆయన స్టేటస్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి తలైవా మూవీలో ఒక చిన్న పాత్ర దొరికితే ఎంత పెద్ద హీరో, హీరోయిన్ అయినా అదృష్టంగా భావిస్తారు. కానీ హీరోయిన్ కాజల్ మాత్రం నిరాకరించింది.
విషయం ఏంటంటే.. సూపర్ స్టార్ కెరీర్‌లో భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమా ‘కబాలి’లో హీరోయిన్ రోల్ కోసం ముందుగా కాజల్ అగర్వాల్‌ను సంప్రదించారట. కానీ సీనియర్ హీరోలతో నటించనని ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసిందట. అంతేకాదు రీసెంట్‌గా రజనీకాంత్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘జైలర్’లో కూడా తమన్న కంటే ముందుగా ఈ పాత్ర కోసం కాజల్‌ను అడిగారట. కానీ ఆమె ఇందులో కూడా నటించడానికి ఒప్పుకోలేదట. ప్రజెంట్ ఈ విషయం వైరల్ అవుతుండటంతో .. ఇంత పొగరు పనికి రాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.






