- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘సుందరకాండ’ మూవీ మోలోడి సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్.. క్యూరియాసిటీ పెంచుతున్నహీరోయిన్ పోస్టర్
టాలీవుడ్ హీరో నారా రోహిత్(Nara Rohit) గత ‘ప్రతినిధి-2’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నారా రోహిత్(Nara Rohit) గత ‘ప్రతినిధి-2’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇటీవల ‘భైరవం’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం నారా రోహిత్ తన కెరీర్‌లో 20వ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ‘సుందరకాండ’ పేరుతో రాబోతున్న ఈ చిత్రాన్ని వెంకటేష్ నిమ్మల పూడి(Venkatesh nimmalapudi) తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రీదేవి విజయ్ కుమార్(Sridevi Vijay Kumar), వ్రితి వాఘావి హీరోయిన్లుగా నటిస్తుండగా.. నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, సత్య, అజయ్, వీటివీ గణేష్, అభినవ్ గోమటం, విశ్వంత్, రూప లక్ష్మి, సునైనా, రఘు బాబు, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను సందీప్ పిక్చర్స్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపోల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. రెండు విభిన్న ప్రేమకథలను ఇందులో చూపించనున్నారు.
షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ గణేష్ చతుర్థి కానుకగా ఆగస్టు 27న ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్రబృందం వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా, ‘సుందరకాండ’ సినిమా నుంచి ప్లీజ్ ప్లీజ్ మ్యామ్ సాంగ్ జులై 31న సాయంత్రం4:03గంటలకు రాబోతున్నట్లు ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో శ్రీదేవి గాగుల్స్ పెట్టుకుని మాస్ లుక్‌లో కనిపించగా.. ఆమెను ట్రై చేస్తున్న యాంగిల్‌లో నారా రోహిత్ ఉన్నాడు. ఇక ఈ పోస్ట్‌కు ‘‘అతను ప్రయత్నిస్తున్నాడు... ఆమె ఇంకా ఆకట్టుకోలేదు. ప్రేమలోని విచిత్రమైన వైపు ఇప్పుడు “ప్లీజ్ ప్లీజ్ మేడమ్...” సుందరకాండ నుంచి ఒక ఉల్లాసభరితమైన సాంగ్ రాబోతుంది. సిద్ధంగా ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేశారు.






