- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాక్సాఫీసును షేక్ చేసిన సినిమా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
కథ ప్రకారం ఆమె మంచానికే పరిమితమైన పాత్రలో కనిపిస్తారు. కనీసం కదలలేని స్థితిలో ఉండి కూడా, కేవలం తన కళ్లతోనే హావభావాలను పండించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.

దిశ, సినిమా: సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘తాయ్ కిళవి’ (Thai Kizhavi). ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. 2026వ సంవత్సరంలో అతి తక్కువ బడ్జెట్‌తో రూపొంది. అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన చిత్రంగా ఇది సరికొత్త రికార్డులను సృష్టించింది. ఒక సీనియర్ నటి చుట్టూ తిరిగే కథతో ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సినిమాకు ప్రధాన బలం రాధికా అద్భుతమైన నటన అని చెప్పొచ్చు. కథ ప్రకారం ఆమె మంచానికే పరిమితమైన పాత్రలో కనిపిస్తారు. కనీసం కదలలేని స్థితిలో ఉండి కూడా, కేవలం తన కళ్లతోనే హావభావాలను పండించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆమె నటన సినిమాకు ప్రాణం పోసిందని, సీనియర్ నటుల సత్తా ఏంటో మరోసారి నిరూపించారని సినీ విమర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తీకేయన్ నిర్మించడం విశేషం. అంతేకాకుండా.. ఈ సినిమాకు వచ్చిన లాభాల్లో రాధికా గారికి వాటా (Profit Share) కూడా ఇచ్చారు. భారతీయ సినీ పరిశ్రమలో ఒక సీనియర్ నటికి లాభాల్లో వాటా ఇవ్వడం ఇదే మొదటిసారి కావొచ్చు, ఇది నిజంగా గొప్ప విషయమని అందరూ అంటున్నారు.థియేటర్లలో రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ (JioHotstar) భారీ ధరకే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఏప్రిల్ 10 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఐఎండీబి (IMDb)లో 8.1/10 రేటింగ్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం, ప్రస్తుతానికి కేవలం తమిళ ఆడియోతోనే అందుబాటులోకి రానుంది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






