విడుదలకు సిద్ధమైన ‘సమ్మర్ హాలీడేస్’ సినిమా

by Mallepaka Hamsa |

మన బాల్యం జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో ‘సమ్మర్ హాలిడేస్’‌ను దర్శకుడు శ్రీకర్ (Sreekar)రూపొందిస్తున్నారు.

విడుదలకు సిద్ధమైన  ‘సమ్మర్ హాలీడేస్’ సినిమా
X

దిశ, సినిమా: కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని(Dheeraj Mogilineni). ఆయన రీసెంట్‌గా పంపిణీ చేసిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ ప్రేక్షకుల ఆదరణతో పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ‘సమ్మర్ హాలిడేస్’(Summer holidays) పేరుతో కొత్త సినిమాను అందించేందుకు సిద్ధమవుతున్నారు. చిల్డ్రన్ మూవీగా నిర్మించిన ఈ చిత్రం మన బాల్యం జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ (Sreekar)రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మాస్టర్ రోహన్ రాయ్, మాస్టర్ అరుణ్ కీలక పాత్రల్లో నటించారు. 90’s మిడిల్ క్లాస్ బయోపిక్, భర్త మహాశయులకు విజ్ఞప్తి వంటి హిట్ చిత్రాల్లో నటించి బాల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రోహన్ రాయ్, 35 చిన్న కథ కాదు సినిమాతో ఫేమ్ అయిన మాస్టర్ అరుణ్ కాంబోలో రాబోతుంది. ఈ మూవీని మే 1న విడుదల చేయబోతున్నారు.

Next Story