ఎన్టీఆర్‌‌కు చంద్రమోహన్‌ మధ్య గొడవ.. వివాదానికి దారితీసిన సంఘటన ఇదే!

by Bhoopathi Nagaiah |

ఒకే రంగంలో పని చేసేవారికి పోటీతత్వం ఎక్కువ. ఒకరినిమించి మరొకరు పని చేయాలని పోటీ పడుతుంటారు.

ఎన్టీఆర్‌‌కు చంద్రమోహన్‌ మధ్య గొడవ.. వివాదానికి దారితీసిన సంఘటన ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఒకే రంగంలో పని చేసేవారికి పోటీతత్వం ఎక్కువ. ఒకరినిమించి మరొకరు పని చేయాలని పోటీ పడుతుంటారు. ఇది సినిమా రంగానికి అతీతం కాదు. ఇలాంటి పోటీ సమయంలో వివాదాలు కామన్. ఇలాగే నందమూరి తారక రామారావు, చంద్రమోహన్ ఓ వివాదం మధ్య తలెత్తింది. ఎవరి జోలికి పోకుండా సౌమ్యంగా ఉండే చంద్రమోహన్ ఓ సందర్భంలో ఎన్టీఆర్ చేసిన పనికి హర్ట్ అయ్యారట. దీంతో స్టార్ హీరోగా ఉన్న ఎన్టీఆర్ ఆహ్వానాన్నే తిరస్కరించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారట.

1975లో ఎస్‌డీ లాల్ దర్శకత్వంలో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా ‘అన్నదమ్ముల అనుబంధం’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ సోదరులుగా మొదట మురళీమోహన్, చంద్రమోహన్‌ను అనుకున్నాట. దీనికి గాను 15 రోజుల పాటు చంద్రమోహన్‌తో రిహార్సల్ కూడా చేయించారట. అయితే షూటింగ్‌కు రెండు రోజుల ముందు ఎన్టీఆర్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చంద్ర మోహన్‌ను ఆ సినిమా నుంచి తప్పించి, ఆ పాత్రలో బాలకృష్ణని పెట్టారట. అయితే ఈ విషయం తెలియని చంద్రమోహన్ షూటింగ్‌కు వెళ్లగా.. అక్కడ ఎవరూ పట్టించుకోలేదట. పైగా తను చేయాల్సిన పాత్ర బాలకృష్ణ చేస్తున్నారని చూసి చంద్రమోహన్ కోపంతో అక్కడ నుంచి వెళ్లిపోయారట.

తర్వాత కొన్ని రోజులుకు ఎన్టీఆర్ తన తరుఫున ఇద్దరి వ్యక్తులని పంపించి.. ‘‘అన్నగారు ఇంకో సినిమాలో మీకు అవకాశం ఇస్తారు రండి’’ అని ఆహ్వానించారట. ఆ వాళ్లు ఆ మాట చెప్పగానే చంద్రమోహన్ కోపంతో ‘‘ఎవరికి కావాలి మీ అన్న గారి అవకాశాలు, తోటి ఆర్టిస్ట్‌లను గౌరవించలేని ఆయన సినిమాల్లో నేను నటించడానికి సిద్ధంగా లేను’’ అని చెప్పండని ఆయన ధైర్యంగా చెప్పి వాళ్లకు బయటకు పంపించారట. ఆ సమయంలో ఈ ఘటన సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిందట. అప్పుటికే మంచి ఫామ్‌లో ఉన్న ఎన్టీఆర్ ఆహ్వానాన్నే తిరస్కరించి వార్తల్లో నిలిచారట చంద్రమోహన్. ఈ విషయాన్ని చంద్రమోహన్ ఓ ఇంటర్వ్యూలో ప్రేక్షకులతో పంచుకున్నారు.

Next Story