‘అనగనగా ఒక రాజు’ బ్లాక్‌బస్టర్ వైబ్స్.. నవీన్ పొలిశెట్టికి సంక్రాంతి కలిసొచ్చినట్టేనా?

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty), మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) జంటగా తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga oka raju)ప్రేక్షకులను ఫుల్‌గా అలరిస్తోంది.

‘అనగనగా ఒక రాజు’ బ్లాక్‌బస్టర్ వైబ్స్.. నవీన్ పొలిశెట్టికి సంక్రాంతి కలిసొచ్చినట్టేనా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty), మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) జంటగా తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga oka raju)ప్రేక్షకులను ఫుల్‌గా అలరిస్తోంది. ఈ చిత్రంతో మారి దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం కాగా.. తొలి ప్రయత్నంలోనే తన మార్క్ కామెడీని బలంగా ప్రెజెంట్ చేశాడనే అభిప్రాయం వినిపిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్‌కు ముందే సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. ఫస్ట్ డే ఫస్ట్ షోల నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకుంటోందిఇప్పటికే పలు ప్రాంతాల్లో షోలు పూర్తి కావడంతో సోషల్ మీడియాలో ప్రేక్షకులు తమ రివ్యూలను షేర్ చేస్తున్నారు.

ముఖ్యంగా నవీన్ పొలిశెట్టి డైలాగ్ డెలివరీ, టైమింగ్, గోదావరి యాసలో వేసిన పంచ్‌లు సినిమాకు ప్లస్‌గా నిలిచాయని నెటిజన్లు చెబుతున్నారు. “నవ్వి నవ్వి బుగ్గలు నొప్పిలేస్తున్నాయి” అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయడం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక హీరోయిన్ మీనాక్షి చౌదరి గ్లామర్‌తో పాటు నటనతోనూ ఆకట్టుకుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, నవీన్‌తో కెమిస్ట్రీ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌ను కూడా ఆకట్టుకునే అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయని టాక్. సంక్రాంతి సీజన్‌లో రిలీజైన సినిమాల్లో ‘అనగనగా ఒక రాజు’ ముందంజలో ఉందని.. నవీన్ పొలిశెట్టికి ఈ పండుగ పూర్తిగా కలిసి వచ్చినట్టేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే జోరు కొనసాగితే బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Next Story