- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అత్యంత రక్తసిక్తమైన ప్రేమకథ బయటపడబోతోంది.. ‘భాఘీ-4’ అప్డేట్ ఇస్తూ వైల్డ్ పోస్టర్ షేర్ చేసిన హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్(Tiger Shroff) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భాఘీ-4’.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్(Tiger Shroff) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భాఘీ-4’. ఈ సినిమా ‘బాఘీ-3’ కి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఎ.హర్ష దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో టైగర్ ష్రాఫ్ సరసన హర్నాజ్ కౌర్ సంధూ(Harnaz Kaur Sandhu) నటిస్తోంది. మిస్ ఇండియా పంజాబ్, మిస్ ఛండీగర్, మిస్ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్ ఇండియా టైటిల్స్ సొంతం చేసుకున్న హర్నాజ్ ‘బాఘీ-4’ (Baaghi-4)రెండో ప్రాజెక్ట్ కావడం విశేషం. ఇందులో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తుండగా.. సోనమ్ బజ్వా ఐటమ్ సాంగ్ చేయబోతుంది. ఈ సినిమాకు సాజిత్ నదియావాలా ఫ్రాంఛైజీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘బాఘీ-4’ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
దీంతో ప్రమోషన్స్ మొదలెట్టిన మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఇక ఇటీవల ఇందులోంచి వచ్చిన అఖేలి లైలా సాంగ్ అంచనాలను మరింత పెంచేసింది. తాజాగా, హర్నాజ్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ‘బాఘీ-4’ అప్డేట్ రాబోతున్నట్లు ప్రకటించింది. ‘‘అత్యంత రక్తసిక్తమైన ప్రేమకథ బయటపడబోతోంది.. ఈ ప్రపంచంలోని.. ప్రతి ప్రేమికుడిలో ఓ విలన్ కూడా ఉంటాడు’’ అనే క్యాప్షన్ జత చేస్తూ ‘బాఘీ-4’ ట్రైలర్ ఆగస్టు 30న ఉదయం 11:11 గంటలకు రాబోతున్నట్లు వెల్లడించింది. అలాగే ఓ పోస్టర్‌ను కూడా వైల్డ్ పోస్టర్‌ను కూడా షేర్ చేసింది. ఇందులో సంజయ్ దత్, టైగర్ ష్రాఫ్ ఉగ్రరూపంతో రక్తం కారుతూ కనిపించగా.. హర్నాజ్ యువరాణి లుక్‌లో కనిపించింది. ఇక సోనమ్ అమాయకంగా చూస్తూ ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది.






