- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధన పిశాచి వస్తుంది.. నయా అవతారాన్ని చూసేందుకు సిద్ధంకండి.. ‘జటాధర’ అప్డేట్ ఇచ్చిన సోనాక్షి
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu) హిట్, ఫ్లాప్ అని చూడకుండా వరుస సినిమాల్లో నటిస్తున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu) హిట్, ఫ్లాప్ అని చూడకుండా వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘జటాధర’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వెంకట్ కళ్యాణ్(Venkat Kalyan) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీస్ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha), శిల్పా శిరోద్కర్, సాక్షి దివ్యా ఖోస్లా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఇందులో శ్రేయా శర్మ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు సమాచారం. డివోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రేరణా అరోరా, జీ స్టూడియోస్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్, అరుణ్ అగర్వాల్, నిఖిల్ నందా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 7న తెలుగు, హిందీ, భాషల్లో థియేటర్స్‌లోకి రాబోతుంది.
షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్స్‌ను చిత్రబృందం రిలీజ్ చేస్తున్నారు. తాజాగా, ‘జటాధర’ చిత్రానికి సంబంధించిన ఓ సాంగ్ రాబోతున్నట్లు సోనాక్షి పవర్ ఫుల్ పోస్టర్‌ను షేర్ చేసింది. ‘‘సెప్టెంబర్ 30న ధన పిశాచి రాబోతుంది.. చెడు నయా అవతారాన్ని చూసేందుకు రెడీగా ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక ఇందులో సోనాక్షి డబ్బు పిచ్చి ఉన్న పాత్రలో కనిపించబోతుంది. విడుదలైన పోస్టర్‌లో ఒంటినిండా నగలతో పట్టుచీర కట్టుకుని.. బెడ్‌పై పడుకుని ఉండగా.. ఆమె చుట్టూ నగలు.. డబ్బు కనిపించాయి. ప్రస్తుతం సోనాక్షి పోస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నాయి.






