- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారితో నటించిన క్షణాలు ఎప్పటికీ నా మనసులో పదిలంగా ఉంటాయి: రితికా సింగ్
మలయాళ ముద్దుగుమ్మ రితికా సింగ్(Ritika Singh) ‘గురు’ చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చింది.

దిశ, సినిమా: మలయాళ ముద్దుగుమ్మ రితికా సింగ్(Ritika Singh) ‘గురు’ చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ సంపాదించుకోలేకపోయింది. ప్రస్తుతం అడపా దడపా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. గత ఏడాది సూపర్ స్టార్ ‘వెట్టైయాన్’ (Vettaiyan)చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటించి మెప్పించింది. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రితికా సింగ్ ‘‘తమిళ ఇండస్ట్రీలోని హీరోలు మానవత్వంతో ఉంటారు. వారితో నటించిన క్షణాలు ఎప్పటికీ నా మనసులో పదిలంగా ఉంటాయి. నేను నటించిన వారిలోంచి ఒకరిని ఎంచుకోవాలంటే.. నేను రజినీకాంత్ సర్ అనే చెప్తాను. ఆయన ఎంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ ఇతరులపై చూపించే ప్రేమాభిమానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. రజినీసార్ చాలా మందివారు. సెట్‌తో అందరితో చాలా సరదాగా ఉంటారు’’ అని చెప్పుకొచ్చింది.






