- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిఖిల్ ‘స్వయంభు’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. వీడియోతో ఫుల్ ఖుషీలో సినీ ప్రియులు
టాలీవుడ్ హీరో నిఖిల్ (Nikhil)పాన్ ఇండియా మూవీ ‘స్వయంభు’ (Swayambhu)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నిఖిల్ (Nikhil)పాన్ ఇండియా మూవీ ‘స్వయంభు’ (Swayambhu)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పీరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి (Bharat Krishnamachari)దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్(Samyuktha Menon), నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని పిక్సెల్ స్టూడియోస్, టాగూర్ మధు ప్రజెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొద్ది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.
షూటింగ్ పూర్తి కానందున అంతగా అప్డేట్స్ కూడా విడుదల కాలేదు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్స్‌లోకి వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆనందానికి గురి చేస్తోంది. ‘స్వయంభు’ మూవీ ఫైనల్ షెడ్యూల్ చిరాలలో జరుగుతుండగా.. అభిమానులంతా కలిసి ఆయనకు పెద్ద పూజ దండ, శాలువాతో వెల్ కమ్ చెప్పారు. దీంతో ఫుల్ హ్యాపీ అయిపోయిన నిఖిల్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అందరితో అప్యాయంగా మాట్లాడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అది చూసిన వారంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.






