Hari Hara Veera Mallu : ఆలస్యం కానున్న 'హ‌రి హ‌ర‌ వీర‌మ‌ల్లు' రిలీజ్

by Phanindra |   (  Updated:2023-02-06 06:51:21  IST  )

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్ కమింగ్ మూవీస్‌లో 'హ‌రిహ‌ర‌ వీర‌మ‌ల్లు' ఒకటి.

Hari Hara Veera Mallu : ఆలస్యం కానున్న హ‌రి హ‌ర‌ వీర‌మ‌ల్లు రిలీజ్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్ కమింగ్ మూవీస్‌లో 'హ‌రిహ‌ర‌ వీర‌మ‌ల్లు' ఒకటి. క్రిష్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తోన్న ఈ పీరియాడిక‌ల్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమాలో ప‌వ‌న్ బందిపోటు దొంగ పాత్రలో క‌నిపించ‌బోతున్నారు. ఇక మూవీ రీలిజ్ డేట్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే గ‌తంలో నిర్మాత ఏ.ఎమ్ ర‌త్నం ఈ సినిమాను మార్చి 30న రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ పవన్ ఇప్పుడు పాలిటిక్స్‌పై దృష్టిసారిస్తుండటం మూలంగా షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో, ద‌స‌రాకు రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో మూవీ యూనిట్ ఉన్నట్లు స‌మాచారం.

Also Read..

అప్డేట్స్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తామంటున్న.. JR.NTR

Next Story