చంద్రహాస్ పాట వివాదంపై మేకర్స్ క్లారిటీ.. దర్శకుడు, నిర్మాత సంచలన వ్యాఖ్యలు!

by Mallepaka Hamsa |

చంద్రహాస్ (Chandrahas) పాడిన పాటలో అసభ్య పదజాలం ఉందంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది.

చంద్రహాస్ పాట వివాదంపై మేకర్స్ క్లారిటీ.. దర్శకుడు, నిర్మాత సంచలన వ్యాఖ్యలు!
X

దిశ, సినిమా: చంద్రహాస్ (Chandrahas)హీరోగా నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన పాడిన పాటలో అసభ్య పదజాలం ఉందంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. చంద్రహాస్ దీనిపై క్షమాపణలు చెప్పకపోగా, తనను విమర్శించిన వారిపై రివర్స్ అటాక్ చేస్తూ వీడియో రిలీజ్ చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. దీంతో ఒక నెటిజన్ చంద్రహాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో తాజాగా, దర్శకుడు సంపత్ రుద్ర(Sampath Rudra), నిర్మాత స్పందించారు. నిర్మాతలు మాట్లాడుతూ.. "సినిమాలోని తన క్యారెక్టర్ గురించి చెప్పబోయి చంద్రహాస్ ఆ పాట పాడారు. అయితే అందులో ఒక తప్పు జరిగింది. ఆ సమయంలో అక్కడున్న ఎవరికీ అది అర్థం కాలేదు. తన క్యారెక్టరైజేషన్ ఫ్లోలో ఆయన పొరపాటు చేశారు. ఈ విషయంపై మేము కూడా చాలా బాధపడుతున్నాం. ఈవెంట్ ముగిసిన వెంటనే ఆ తప్పు గురించి చంద్రహాస్‌కు చెప్పాము" అని వివరించారు.

దర్శకుడు సంపత్ రుద్ర మాట్లాడుతూ.. ‘బరాబర్ ప్రేమిస్తా’ ఈవెంట్‌లో ఒక పొరపాటు జరిగిన మాట వాస్తవమే అని, కానీ సినిమాలో అలాంటి అసభ్యత ఏమీ ఉండదని స్పష్టం చేశారు. చంద్రహాస్ చేసిన వ్యాఖ్యల వల్ల తలెత్తిన వివాదం పట్ల తాము ఫీలవుతున్నామని ఆయన పేర్కొన్నారు. రేపు సినిమా విడుదల కాబోతున్న తరుణంలో, ఈ వివాదం సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్న ఆందోళన చిత్ర యూనిట్‌లో కనిపిస్తోంది. కాగా.. ఈ యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటించిన తాజా చిత్రం బరాబర్ ప్రేమిస్తా. ఈ చిత్రంలో మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటిస్తున్నది. సీసీ క్రియేషన్స్, ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్‌పై ఈ మూవీని గేద చందు, గాయత్రి చిన్ని, వెంకటేశ్వరరావు నిర్మించారు. రూరల్ డ్రామాగా, లవ్, అండ్ యూత్‌ఫుల్ ఎమోషనల్ అంశాలతో రూపొందిన ఈ సినిమాకు సంపత్ రుద్ర దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో అర్జున్ మహి, మధునందన్, మీసాల లక్ష్మణ్, అభయ్ నవీన్, రాజశేఖర్ అనిగి, కీర్తి లతా గౌడ్, సునీతా మనోహర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

Next Story