- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆమె ఊపిరి మోయలేక అగ్గే బూడిదైంది.. ఆఖరికి సావే సచ్చిపోయింది’.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న ‘మైసా’గ్లింప్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna)పుష్ప-2, చావా వంటి హిట్ చిత్రాల్లో నటించిన తర్వాత అమ్మడు రేంజ్ మారిపోయింది.

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna)పుష్ప-2, చావా వంటి హిట్ చిత్రాల్లో నటించిన తర్వాత అమ్మడు రేంజ్ మారిపోయింది. భాషతో సంబంధం లేకుండా బ్యాకు టు బ్యాక్ అవకాశాలు అందుకుంటూ కెరీర్ పరంగా ఫుల్ బిజీ అయిపోయింది. ప్రస్తుతం రష్మిక మందన్న లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆమె కెరీర్‌లోనే తొలిసారిగా.. ఓ వపర్‌ఫుల్ యాక్షన్ పాత్రలో నటిస్తోంది. ‘మైసా’ (Mysaa)టైటిల్ రాబోతున్న ఈ సినిమాను రవీంద్ర పులే (Ravindra Pule)పాన్ ఇండియా ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మికతో పాటు దీక్షిత్ శెట్టి, తారక పొన్నప్ప కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. ఈ మూవీకి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.
అయితే ఈ సినిమాను తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో నివసించే ‘గోండు’తెగల నేపథ్యంలో రూపొందుతోందని సమాచారం. హక్కుల కోసం పోరాడే ఒక వీరనారిగా, పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో రష్మిక కనిపించబోతుంది. ఇందులో గోండు తెగల జీవన విధానం, వారి సాంప్రదాయాలు కష్టాలు, పేదరికం వంటి వన్నీ ఈ రియలిస్టిక్‌గా చూపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీల్లోనూ అంచనాలు పెంచింది. తాజాగా, రష్మిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ‘మైసా’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను షేర్ చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది.
ఇక ఇందులో బ్యాక్‌గ్రౌండ్ డైలాగులతో రష్మిక ఎంట్రీ ఇవ్వడం అందరిలో క్యూరియాసిటీని పెంచింది. ‘‘నా బిడ్డ సచ్చిందన్నారు..కానీ మట్టే వణికిపోయింది నా బిడ్డ రక్తాన్ని దాసలేక. గాలే ఆగిపోయింది.. నా బిడ్డ ఊపిరి మోయలేక. అగ్గే బూడిదైంది.. మండుతున్న నా బిడ్డని సూడలేక. ఆఖరికి సావే సచ్చిపోయింది.. నా బిడ్డని సంపలేక. ఆమె ఎవరో తెలుసా?’’ అని చెప్తుండగా.. రష్మిక రక్తం కారుతున్న శరీరంతో తుపాకీ పట్టుకుని ఎవరికో గురి పెడుతూ ముక్కుకు ముక్కెరతో.. చేతికి సంకెళ్లు వేసుకుని పవర్ ఫుల్ లుక్‌లో కనిపించి గూస్ బంప్స్ వచ్చేలా చేసింది. అయితే ప్రతీకారం తీర్చుకునే ‘మైసా’ పేరును గుర్తుంచుకోండి అని వీడియోను ముగించారు. ఈ గ్లింప్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి.






