సానియా మీర్జాకు బిగ్ షాక్ ఇచ్చిన భర్త.. నటిని మూడో పెళ్లి చేసుకున్న షోయబ్

by Disha Web Desk 6 |
సానియా మీర్జాకు బిగ్ షాక్ ఇచ్చిన భర్త.. నటిని మూడో పెళ్లి చేసుకున్న షోయబ్
X

దిశ, సినిమా: భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను 2010లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటికే 2002లో అయేషా సిద్ధిఖిని వివాహమాడిన అతను ఆమెతో విడాకులు తీసుకుని సానియాను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి మీర్జా మాలిక్ అనే కుమారుడు కూడా పుట్టాడు. వారి కాపురం కొద్ది కాలం బాగానే సాగింది. అంతా బాగానే ఉందనుకునే సమయంలో భర్తతో విడాకులు తీసుకుని విడిపోయిందని వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో సానియా కూడా డైవర్స్ తీసుకున్నట్లు హింట్ ఇస్తూ ఎమోషనల్ పోస్టులు పెట్టింది. కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఈ క్రమంలో తాజాగా, భర్త షోయబ్ సానియాకు బిగ్ షాకిచ్చాడు. అతను పాకిస్థాన్ నటి సనా జావెద్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం వారి పెళ్లి ఫొటోలు నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి. వాటిని చూసిన వారు సానియాతో విడాకులు తీసుకున్నాడా? లేదా అని అనుమానపడుతున్నారు. కొందరు మాత్రం కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Next Story

Most Viewed