యాక్షన్ థ్రిల్లర్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న హాట్ బ్యూటీ.. లక్కీ చాన్స్ కొట్టేసిందిగా!

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-06 06:37:21  IST  )

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్(Jacqueline Fernandez) ఇటీవల ‘హౌస్‌ఫుల్-5’(Housefull-5) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

యాక్షన్ థ్రిల్లర్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న హాట్ బ్యూటీ.. లక్కీ చాన్స్ కొట్టేసిందిగా!
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్(Jacqueline Fernandez) ఇటీవల ‘హౌస్‌ఫుల్-5’(Housefull-5) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌లో అవకాశాలు అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉంది. అలాగే స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ జనాలను ఎంటర్‌టైన్ చేస్తుంది. తాజాగా, జాక్వెలిన్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గతంలో ప్రభాస్ ‘సాహో’ మూవీ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడిన ఈ భామ ఇప్పుడు ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో రాబోతున్నట్లు సమాచారం. ‘పేపర్ బాయ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వి. జయశంకర్(V. Jayashankar) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుండగా.. యాక్షన్, సస్పోన్స్‌తో కూడిన ఒక ఇంటన్స్ స్క్రిప్ట్‌ను జయశంకర్ రెడీ చేశాడు. ఈ స్టోరీ జాక్వెలిన్‌ను చెప్పడంతో కథ నచ్చడంతో అమ్మడు నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఇందులో యాక్షన్స్ సీన్స్‌లో పవర్ ఫుల్ లేడీగా జాక్వెలిన్ కనిపించనుంది.

ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ చేసే ప్లాన్‌లో దర్శకుడు ఉండగా.. ఈ సినిమా కోసం జాక్వెలిన్ ఉత్సాహంగా ఉందని సమాచారం. ముఖ్యంగా దీని మేకోవర్‌కు పూర్తి శారీరక పరివర్తన అవసరం కాబట్టి. ఈ పాత్రను పోషించడానికి ఆమె పలు సన్నాహాలు కూడా ప్రారంభించిందట. ఈ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఇందుకు సంబంధించిన పోస్టులు మాత్రం ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నాయి.కొందరు లక్కీ గర్ల్ అని కామెంట్లు చేస్తున్నారు.

Next Story