- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరోయిన్ క్యారెక్టర్ ఇంటెన్స్‌గా ఉంటుంది.. అవార్డులు రావడం ఖాయం: అల్లు అరవింద్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(rashmika mandanna), టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి (deekshith shetty)జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’ .

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(rashmika mandanna), టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి (deekshith shetty)జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’ . ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 7న రిలీజ్ చేయనున్నారు. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్రబృందం.. అప్డేట్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కథను రాహుల్ నాలుగేళ్ల క్రితం చెప్పాడు. ఆహాకు వెబ్ సిరీస్‌లా చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. కానీ ఇలాంటి మంచి కథతో సినిమా చేస్తేనే బాగుంటుందని అనిపించింది. ఆ తర్వాత ఎప్పుడు కలిసినా ఈ కథ గురించి రాహుల్‌కు గుర్తుచేసేవాడిని. ఈ కథలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. అంత హెవీ పర్ ఫార్మెన్స్ ఎవరు చేస్తారని అనుకున్నప్పుడు రష్మిక మాత్రమే చేయగలదు అని ఆమెను తీసుకున్నాం. తను నాకు కూతురు లాంటిది. రష్మిక ఈ సినిమాతో బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ అందుకుంటుందని నమ్ముతున్నా. రష్మిక దీక్షిత్‌తో ఒక ఇంటెన్స్ పర్ ఫార్మెన్స్ తీసుకున్నాడు రాహుల్. అతన్ని చూస్తే ఇలాంటి సినిమా ఇతను చేశాడా అనిపిస్తుంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండను గెస్ట్‌గా తీసుకొద్దామని అన్నారు.






