ఇకపై సహించేది లేదు.. చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్

by Mallepaka Hamsa |

మలయాళ క్రేజీ హీరోయిన్ మహిమా నంబియార్(Mahima Nambiar) అందరికీ సుపరిచితమే.

ఇకపై సహించేది లేదు.. చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, సినిమా: మలయాళ క్రేజీ హీరోయిన్ మహిమా నంబియార్(Mahima Nambiar) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. అంతేకాకుండా తమిళంలోనూ స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక మలయాళంలో 50కి పైగా చిత్రాల్లో నటించిన ఈ భామ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం మహిమా నంబియార్ ‘మందాడి’ (Mandadi)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో సూరి హీరోగా నటిస్తుండగా.. టాలీవుడ్ నటుడు సుహాస్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. స్పోర్ట్స్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మహిమా నంబియార్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు హాట్ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. అయితే గత కొద్ది కాలంగా ట్రోలింగ్ జరుగుతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, మహిమా నంబియార్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ..స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ‘‘గత కొన్ని రోజులుగా కొంతమంది నా పేరుతో తప్పుడు, అసభ్యకరమైన వ్యాఖ్యలతో ఫోటోస్ షేర్ చేస్తున్నారు. నా గురించి పూర్తిగా అవాస్తవాలను ప్రసారం చేస్తున్నారు. అలాంటి వదంతులను ఇప్పటివరకు సహిస్తూ వచ్చాను. నేను మీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోను.. కాబట్టి నేను అదే గౌరవాన్ని తిరగి పొందాలనుకుంటున్నాను.

పదే పదే పరువు నష్టం కలిగించే.. అగౌరపరిచే వ్యాఖ్యలు చేయడం బాధగా అనిపిస్తుంది. ఎవరు ఏమన్నా ఇకపై సహించేది లేదు. ఒకవేళ ఎవరైనా హద్దులు దాటి నాపై అసత్య ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాను. ఇదే నా చివరి హెచ్చరిక. హద్దులు దాటితే ఊరుకునేది లేదు. చర్యలు తీసుకోవడం తప్ప నాకు వేరే దారి లేదు.. అందరికీ ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు అసలు ఏమైందా? అని ఆరా తీస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Next Story