- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కపుల్ ఫ్రెండ్లీ’ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్.. క్యూరియాసిటీని పెంచుతున్న పోస్టర్
టాలీవుడ్ యంగ్ హీరో సంగీత్ శోభన్(Sangeet Shobhan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కపుల్ ఫ్రెండ్లీ’(Couple friendly).

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సంగీత్ శోభన్(Sangeet Shobhan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కపుల్ ఫ్రెండ్లీ’(Couple friendly). రొమాంటిక్ లవ్ స్టోరీతో రాబోతున్న ఈ చిత్రంలో మానస వారణాసి (Manasa Varanasi)హీరోయిన్‌గా నటిస్తోంది. అశ్విని చంద్రశేఖరన్ దర్శకత్వం వహిస్తున్నారు. రవీంద్రన్ సంగీతం అందిస్తుండగా.. చెన్నై బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవి క్రీయేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈమూవీకి సంబంధించిన పోస్టర్స్, టీజర్ విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రబృందం మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేశారు.
తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ నాలో నేను సాంగ్ రాబోతున్నట్లు తెలుపుతూ మానస ప్రకటన విడుదల చేసింది. ఈ సాంగ్ ప్రోమో షేర్ చేస్తూ.. మొత్తం పాట ఆగస్టు 25న సాయంత్రం 5: 10 గంటలకు రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేసింది. ఇక ఇందులో హీరోయిన్ హ్యాండ్ బ్యాక్ వేసుకుని వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ నడుస్తుండగా.. ఆమె వెనకా హీరో బ్యాగ్ వేసుకుని చేతిలో హెల్మెట్‌తో ఆమెను చూస్తే వెనకాల వెళ్తున్నట్లు కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.






