- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శింబు ‘అరసన్’ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. అలాంటి పోస్ట్‌తో హింట్ ఇచ్చిన హాట్ బ్యూటీ!
కోలీవుడ్ స్టార్ హీరో శింబు(Simbu) నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘అరసన్’(Arasan).

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శింబు(Simbu) నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘అరసన్’(Arasan). ఈ సినిమా ఆయన కెరీర్‌లో 49వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కతుంది. వెట్రిమారన్(Vetrimaaran) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా ‘వడ చెన్నై యూనివర్స్’లో భాగమని పలు పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్లతో పక్కా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో శింబు సరసన నటించే హీరోయిన్ ఎవరా? అనే చర్చ జోరుగా సాగుతోంది. శ్రీలీల, సమంత, కీర్తి సురేష్ పేర్లు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. ఈక్రమంలో.. తాజాగా, ఓ హీరోయిన్ పోస్ట్‌తో హింట్ ఇచ్చింది. హాట్ బ్యూటీ ఆండ్రియా జెర్మియా(Andrea Jeremiah) పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
అందులో చంద్ర అనే క్యాప్షన్ ఇవ్వడంతో ‘అరసన్’ నటిస్తున్నట్లు ఈ పోస్ట్‌తో కన్ఫర్మ్ చేసిందని అంతా చర్చించుకుంటున్నారు. ఇందులో చంద్ర పాత్రలో తిరిగి నటిస్తుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. వెట్రిమారన్ తెరకెక్కించిన ‘వడ చెన్నై’లో ఈ అమ్మడు చంద్ర పాత్రలో నటించి మంత్రముగ్దులను చేసింది. ఇక ఇప్పుడు ‘అరసన్’మరోసారి అదే పాత్రలో నటిస్తుందనే పుకార్లు మొదలయ్యాయి. అంతేకాకుండా ఆమె షూటింగ్‌లో కూడా జాయిన్ అయినట్లు టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ఆండ్రియా పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు చంద్ర ఈజ్ బ్యాక్ అనే కామెంట్లు పెడుతున్నారు.






