తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన హీరోయిన్.. బేబీ బంప్ చూసి షాక్ అవుతూ కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

ఒకప్పటి హీరోయిన్ సోనమ్ కపూర్(Sonam Kapoor) ఓ శుభవార్తను ప్రకటించారు.

తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన హీరోయిన్.. బేబీ బంప్ చూసి షాక్ అవుతూ కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: ఒకప్పటి హీరోయిన్ సోనమ్ కపూర్(Sonam Kapoor) ఓ శుభవార్తను ప్రకటించారు. తాను రెండో సారి తల్లి కాబోతున్నట్లు వెల్లడిస్తూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ పోస్ట్‌కు ‘మదర్’ అనే ఒక్క పదాన్ని మాత్రమే క్యాప్షన్‌గా జోడించి అందరి దృష్టిని ఆకర్షించింది. తను ధరించిన హాట్ పింక్ అవుట్‌ఫిట్‌తో కనిపించింది. 80వ దశకంలో ప్రిన్సెస్ డయానా ధరించిన దుస్తులను పోలి ఉండటం విశేషం. ప్యాడెడ్ షోల్డర్స్‌తో ఉన్న సూట్‌లో సోనమ్ మెస్మరైజింగ్‌గా ఉంది.

ఇక ఇందులో బేబీ బంప్‌తో కనిపించడంతో అంతా షాక్ అవుతూ కంగ్రాట్స్ అంటే కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. సోనమ్ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో కనిపించిన ఆమె 2018లో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహుజా(Anand Ahuja)ను పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు పెళ్లైన మూడు సంవత్సరాల తర్వాత ఓ కుమారుడు జన్మించగా.. ఆ బాబుకు వాయు అని నామకరణం చేశారు. ఇప్పుడు మరోసారి తల్లి కాబోతుంది. వచ్చే ఏడాది డెలివరీ కాబోతున్నట్లు సమాచారం. ఈ శుభవార్తతో అభిమానులు సంతోషపడుతున్నారు.

Next Story