Bigg Boss House లోకి అలనాటి హీరో.. ఏంట్రీతో ఏం జరగనుందో

by Chukka Sudharani |   (  Updated:2023-08-24 17:02:34  IST  )

బిగ్‌ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

Bigg Boss House లోకి అలనాటి హీరో.. ఏంట్రీతో ఏం జరగనుందో
X

దిశ, సినిమా: బిగ్‌ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈసారి హౌస్‌లోకి రాబోతున్న కంటెస్టెంట్లపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటి వరకైతే ఇందులోకి సినీ నటి సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రీత, జబర్దస్త్ కమెడియన్ నరేష్ వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అలనాటి ‘ప్రేమదేశం’ మూవీ హీరో అబ్బాస్ కూడా రానున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం అబ్బాస్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడంటూ పుకార్లు వస్తున్నాయి. అదే నిజమైతే ఈ హీరోకి పెద్ద బూస్ట్ అనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి :

Unstoppable Season-3: ఒకే వేదికపై Chiranjeevi , Balayya Babu... ఫ్యాన్స్‌కి పండుగే..!

OTT : ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి ‘కింగ్ ఆఫ్ కొత్త’..

Next Story