- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా సభ్యుల ఆరోగ్యమే మాకు ప్రాధాన్యం: మంచు విష్ణు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కి విష్ణు మంచు (Vishnu Manchu)ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ఆరోగ్యానికి పెద్ద పీఠ వేసిన సంగతి తెలిసిందే.

దిశ, సినిమా: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కి విష్ణు మంచు (Vishnu Manchu)ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ఆరోగ్యానికి పెద్ద పీఠ వేసిన సంగతి తెలిసిందే. ‘మా’ సభ్యుల ఆరోగ్యం కోసం ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్‌లను విష్ణు మంచు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సిటీలోని పెద్ద మల్టీస్పెషాల్టీ హాస్పిటల్స్‌తో కలిసి హెల్త్ క్యాంప్‌లను నిర్వహించారు. ఇక ఈ హెల్త్ క్యాంప్‌లో ‘మా’ సభ్యులంతా పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు.. కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ‘మా’ సభ్యుల కోసం విష్ణు మంచు హెల్త్ క్యాంప్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ‘మా’ ప్రెసిడెంట్ విష్ణు మంచు, ‘మా’ ట్రెజరర్ శివ బాలాజీ(Shiva Balaji), రాజీవ్ కనకాల(Rajeev Kanakala) వంటి వారు పాల్గొన్నారు. ఇందులో.. విష్ణు మంచు మాట్లాడుతూ .. ‘‘మా’ సభ్యుల ఆరోగ్యం కోసం నిర్వహిస్తున్న హెల్త్ క్యాంప్‌లను విజయవంతం చేసిన సభ్యులకు, హాస్పిటల్ బృందానికి ధన్యవాదాలు. సభ్యుల ఆరోగ్యమే మాకు ప్రాధాన్యం. అందుకే ఇలా నిత్యం హెల్త్ క్యాంప్‌లను నిర్వహిస్తున్నాం. మాకు సహకరించిన కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ బృందానికి ధన్యవాదాలు’’ అని అన్నారు.






