- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుమ్ము దులిపేసిన ధనుష్.. 'ది గ్రే మ్యాన్'లో సోలో ఫైట్ హైలేట్ (వీడియో)
థియేటర్లలో జూలై 16న, నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 22న విడుదల కానుంది. Dhanush in 'The Gray Man' clip gone viral in internet.

దిశ, వెబ్‌డెస్క్ః తమిళ సూపర్ స్టార్ ధనుష్ అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాడు. హాలీవుడ్‌లో ధనుష్ హవా మొదలైనట్లే అనిపిస్తుంది. ఇటీవల కెన్ స్కాట్ 'ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్'లో నటించిన తర్వాత, ధనుష్ త్వరలో 'అవెంజర్స్: ఎండ్‌గేమ్స జో, ఆంథోనీ రస్సో గ్లోబ్‌ట్రోటింగ్ యాక్షన్-థ్రిల్లర్ 'ది గ్రే మ్యాన్'లో హాలీవుడ్ స్టార్స్ ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్‌లతో కలిసి కనిపించనున్నాడు. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రంలో ధనుష్ అవిక్ సాన్ పాత్రలో నటించాడు. కాగా, ఇందులో ధనుష్ 'ప్రాణాంతక శక్తి'గా అభివర్ణించబడ్డాడు. కోర్ట్ జెంట్రీ-సియెర్రా సిక్స్ తర్వాత కనిపిస్తాడు. సియెర్రా సిక్స్, గోస్లిన్‌కి చెందిన రోగ్ CIA కిరాయి సైనికుడు. ఇందులో ధనుష్ పాత్ర సియెర్రా సిక్స్, అనా డి అర్మాస్ పాత్ర డాని మిరాండా ఇద్దర్నీ ఒకేసారి రఫ్ఫాడించినట్లు సినిమా ప్రోమోలో కనిపిస్తుంది. ధనుష్ చేసిన అవిక్ పాత్ర ఈ క్లిప్‌లో ఒకే సమయంలో వారిద్దరితో పోరాడుతూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. నెట్టింట్లో ఈ ప్రమోషనల్ వీడియోను రస్సో బ్రదర్స్ తమ ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. "లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, మేము మీకు ఇస్తున్నాము... ధనుష్. #TheGrayMan" అంటూ శీర్షక పెట్టారు. 'ది గ్రే మ్యాన్' 200 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో అత్యంత ఖరీదైన నెట్‌ఫ్లిక్స్ చిత్రంగా రూపొందింది. ఇది ఎంపిక చేసిన థియేటర్లలో జూలై 16న, నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 22న విడుదల కానుంది.






