- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్షమాపణలు కోరుతూ ‘ది గర్ల్ ఫ్రెండ్’ డైరెక్టర్ ట్వీట్.. కారణం ఏంటంటే?
రష్మిక మందన్న(Rashmika Mandanna),దీక్షిత్ శెట్టి (Dixit Shetty)జంటగా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend)పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది.

దిశ, సినిమా: రష్మిక మందన్న(Rashmika Mandanna),దీక్షిత్ శెట్టి (Dixit Shetty)జంటగా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend)పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కొంతమందిని కన్నీరు పెట్టేలా చేస్తూ.. ప్రశంసలు పొందుతోంది. అలాగే కలెక్షన్లు కూడా బాగానే రాబడుతోంది. ఈనేపథ్యంలో.. తాజాగా, రాహుల్ రవీంద్రన్ క్షమాపణలు చెప్తూ ఓ ట్వీట్ పెట్టాడు. ‘‘దయచేసి అందరూ నన్ను క్షమించండి. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఎవరైతే సినిమాలో తమకు నచ్చిన అంశాల గురించి చెబుతూ పోస్ట్ పెడుతున్నారో వారందరికీ నేను రియాక్ట్ అవుతున్నాను. ఈ వరుస ట్వీట్స్ వల్ల నా టైమ్ లైన్ మొత్తం ‘ది గర్ల్ ఫ్రెండ్’ నిండిపోతుంది. ఇలా వరుసగా సినిమాకు సంబంధించిన వార్తలు పంచుకోవడం వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తోంది. సాధారణంగా ఈ మధ్యకాలంలో మౌత్ టాక్‌తోనే చాలా చిత్రాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి.
ఇక అందుకే ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ బాగుందని ప్రతి ఒక్కరూ తమ రెస్పాన్స్ షేర్ చేస్తుంటే ఇది ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా నేను ఇలా ప్రతి ట్వీట్‌కి రిప్లై ఇస్తున్నాను. అలా చేయడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతోంది. ఇలాంటి వారికి నా తరుపున క్షమాపణలు తెలిజేస్తున్నాను’’ అని రాసుకొచ్చారు. ఇక ఆయన ఆలోచనా తీరుకు నెటిజన్లు ఇలా కూడా ఉంటారా? అని షాక్ అవుతుండగా.. మరికొందరు మాత్రం ఫిదా అవుతున్నారు.






