- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ది రాజాసాబ్’ ఫస్ట్ సింగిల్ వచ్చేది ఆ రోజే.. కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్‌లో జోష్ పెంచిన డైరెక్టర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న ప్రాజెక్ట్స్‌లో ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజాసాబ్’(The Rajasaab).

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న ప్రాజెక్ట్స్‌లో ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజాసాబ్’(The Rajasaab). మారుతి(Maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. హారర్, కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతుంది. ఈ జానర్‌లో ప్రభాస్ మొదటి సారి నటిస్తుండటంతో అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. సంజయ్ దత్, యోగిబాబు ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న థియేటర్స్‌లోకి రాబోతుంది.
ఇక ఇటీవల షూటింగ్ సెట్ నుంచి ఫస్ట్ సింగిల్‌కు సంబంధించిన ఫొటోలు లీక్ కాగా.. ఈ పాటపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా ఎదురుచూస్తున్నారు. తాజాగా, ఈ విషయంపై డైరెక్టర్ మారుతీ క్లారిటీ ఇస్తూ ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసి అభిమానుల్లో జోష్ పెంచారు. ఈ సినిమా నుంచి మొదటి పాట ‘రెబల్ సాబ్’ను నవంబర్ 23న విడుదల చేయనున్నట్లు వెల్లడిస్తూ ప్రభాస్ రంగురంగుల చొక్కా ధరించి మాస్ స్టెప్ ఫోజులో ఉండగా.. వెనకాల గుడి. జాతర వాతావరణంతో పాటు వందల మంది డ్యాన్సర్లు ఉన్న పోస్టర్‌ను షేర్ చేశారు. దీంతో అభిమానులు ఆనంద పడుతున్నారు. అలాగే ఈ పాటలో డార్లింగ్ సరసన ఏ హీరోయిన్ చిందులేయనుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి.






