- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘వానర’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్
అవినాష్ తిరువీధుల (Avinash Tiruveedhula)హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘వానర’(vanara).

దిశ, సినిమా: అవినాష్ తిరువీధుల (Avinash Tiruveedhula)హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘వానర’(vanara). ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి(Simran Choudhary) హీరోయిన్‌గా నటిస్తుండగా.. నందు విలన్ పాత్రలో కనిపించనున్నారు. ‘వానర’ చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్‌పై అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్, వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాయి. మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో తెరకెక్కిన ‘వానర’ సినిమా ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా.. మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేశారు. ఈ రోజు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ సాంగ్ లాంచ్ నిర్వహించారు. ఈ పాటను మంచి బీట్‌తో కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్, భరద్వాజ్ గాలితో కలిసి లిరిక్స్ రాసి పాడారు. ‘అదరహో..’ పాట ఎలా ఉందో చూస్తే - ‘అదర బెదరహో బెదరహో అదరహో, బెదర అదరహో అదరహో బెదరహో.. అల్లాటప్పా ఆటలే అల్లాడించే వేటులే కుర్రాడితో వేటలో అబ్బా భలే ఘాటులే..’ అంటూ ర్యాప్ స్టైల్‌లో కొనసాగుతూ ఆకట్టుకుంటుందీ పాట.






