- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కిల్లర్’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల.. హీరోయిన్‌ను ఎత్తుకుని షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన సూర్య
మల్టీ టాలెంటెడ్ నటుడు ఎస్ జె సూర్య(SJ Surya) ఓ వైపు వరుస సినిమాలు తెరకెక్కిస్తూనే పలు ప్రాజెక్ట్స్‌లో విలన్ పాత్రలో నటిస్తూ మెప్పిస్తున్నారు.

దిశ, సినిమా: మల్టీ టాలెంటెడ్ నటుడు ఎస్ జె సూర్య(SJ Surya) ఓ వైపు వరుస సినిమాలు తెరకెక్కిస్తూనే పలు ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ విలన్ పాత్రలో మెప్పిస్తున్నారు. అంతేకాకుండా సంగీత దర్శకుడిగానూ వ్యవహరిస్తున్నారు. పలు పాటలు కూడా పాడిన ఆయన ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. గత ఏడాది ‘సరిపోదా శనివారం’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఎస్ జె సూర్య స్వయం దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ చిత్రం ‘కిల్లర్’. ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ కూడా ఆయనే సమకూరుస్తుండటం విశేషం. ‘కిల్లర్’(killer) చిత్రాన్ని శ్రీ గోకులం మూవీస్, ఏంజెల్ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో సూర్య సరసన ప్రీతి అస్రాని(Preethi Asrani) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవల ప్రారంభించారు. ఈక్రమంలో.. ఈ నెల 20న ఎస్ జె సూర్య పుట్టినరోజు కావడంతో ఒక రోజు ముందుగానే అభిమానులను ట్రీట్ ఇచ్చాడు. తాజాగా, ‘కిల్లర్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను షేర్ చేశారు. ‘‘అభిమానులు & స్నేహితులు మీ అందరికీ నా పుట్టినరోజు బహుమతిగా KillerFirstLook ని అందిస్తున్నాను. రేపు ఉదయం మీరందరూ నా గురించి ప్రార్థనలు చేయండి.
నేను ఎప్పటిలాగే మీ అందరినీ నా ప్రార్థనలలో ఉంచుకుంటాను’’ అని రాసుకొచ్చారు. పోస్టర్‌లో ఆయన బ్లాక్ సూట్ ధరించి గాగూల్స్ పెట్టుకుని టై కట్టుకుని ఉన్నాడు. అలాగే ఒక చేతిలో గన్ పట్టుకుని ఎవరికో గురిపెట్టగా.. మరో చేతిలో హీరోయిన్ ప్రీతిని ఎత్తుకున్నాడు. ఆమె తన భుజాల పై నుంచి చూస్తూ గులాబీలు పట్టుకుని నవ్వుతూ కనిపించింది. అయితే ఈ పోస్టర్ మొత్తంలో ఎక్కువగా ఎరుపు రంగు కనిపిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. అలాగే కొంతమందిని షాక్‌కు గురి చేస్తోంది.






