గూస్‌బంప్స్.. 'ఆదిపురుష్' ఫస్ట్‌లుక్ విడుదల

by Disha Web Desk 2 |
గూస్‌బంప్స్.. ఆదిపురుష్ ఫస్ట్‌లుక్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న 'ఆదిపురుష్' సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ట్విట్టర్ వేదికగా దర్శకుడు ఓంరౌత్ ప్రభాస్ లుక్‌ను విడుదల చేశారు. ఆకాశం వైపు విల్లు ఎక్కుపెట్టిన ప్రభాస్‌ లుక్‌ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. దీంతో 'అచ్చం రాముడిని దింపేశావ్ అన్నా' అంటూ ట్విట్టర్‌లో ప్రభాస్ ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతూ ట్రెండ్ చేస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను అక్టోబర్ 2వ తేదీన ఉదయం 7 గంటలకు విడుదల చేస్తామని డైరెక్టర్ ఓంరౌత్ ప్రకటించారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కృతి సనన్ నటిస్తోంది. ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు.

Also Read: సమంత 'శాకుంతలం' సినిమా వాయిదా.. ఎందుకంటే?




Next Story

Most Viewed