Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్.. అందుకే శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నామంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-04 12:13:16  IST  )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్.. అందుకే శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నామంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Ustad Bhagat Singh) కూడా ఒకటి. అయితే హరీష్ శంకర్ (Harish Shankar)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా? అని పవన్ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కనీసం అప్డేట్స్ అయినా విడుదల చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, డైరెక్టర్ హరీష్ శంకర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో ముచ్చటించిన ఆయన జూన్ రెండో వారం నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నాము. అందుకే శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చామని చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు ఆనందపడుతున్నారు.

Next Story