- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన డైరెక్టర్.. ‘స్పిరిట్’ అప్డేట్‌తో భారీ హైప్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) నటిస్తున్న ప్రాజెక్ట్స్‌ల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా ‘స్పిరిట్’(spirit).

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) నటిస్తున్న ప్రాజెక్ట్స్‌ల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా ‘స్పిరిట్’(spirit). సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘యానిమల్’తో హిట్ అందుకున్న సందీప్ మరోసారి మ్యాజిక్ చేయబోతున్నాడు. ప్రస్తుతం దర్శకుడు నటీనటులను ఫైనల్ చేసే పనిలో పడ్డాడు. ఈక్రమంలో.. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ‘సౌండ్ స్టోరీ ఆఫ్ ది ఫిలిం స్పిరిట్’ పేరుతో చిన్న గ్లింప్స్ వీడియోను షేర్ చేశాడు. ఇక ఇందులో.. ఐపీఎస్ అధికారిగా ప్రభాస్ నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్ వాయిస్‌తో వీడియోను ఎడిట్ చేశారు. ‘‘వీడి గురించి చాలా విన్నాను.
యూనిఫామ్ ఉన్నా.. లేకపోయినా ప్రవర్తనలో తేడా ఉండదని ఖైదీ యూనిఫాంలో ఎలా ప్రవర్తిస్తాదో చూద్దాం. వీడి బట్టలూడదీసి మెడికల్ టెస్ట్‌కు పంపించండి అంటాడు?. ఇక ప్రభాస్.. మిస్టర్ సూపర్‌డెంట్ చిన్నప్పటి నుంచి నాకు ఒక బ్యాడ్ హ్యబిట్ ఉంది’’ అని చెప్పిన డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. అంతటితో గ్లింప్స్ పూర్తి అయినప్పటికీ ప్రేక్షకుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేశారు. ఇదే ఇలా ఉంటే.. ఇంకా టీజర్ ఎలా ఉంటుందో అని అభిమానులు ఎక్జైట్ అవుతున్నారు. కాగా.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా.. వివేక్ ఒబెరాయ్, కాంచన, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది.






