- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీకాంత్ ఎదుర్కొనే ప్రమాదాలు మరింత తీవ్రమవుతాయి.. ‘ది ఫ్యామిలీ మ్యాన్-3’ స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్
ప్రేక్షకుల్లో విశేష ఆదరణ పొందిన వెబ్‌సిరీస్‌ల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ (The Family Man)ఒకటి.

దిశ, సినిమా: ప్రేక్షకుల్లో విశేష ఆదరణ పొందిన వెబ్‌సిరీస్‌ల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ (The Family Man)ఒకటి. ఈ సిరీస్ దాదాపు రెండు సీజన్లను పూర్తి చేసుకోగా.. భారీ సక్సెస్ అందుకున్నాయి. ఈక్రమంలోనే.. ఈ సిరీస్‌కు కొనసాగింపుగా సీజన్-3 రాబోతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా, ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ ‘ది ఫ్యామిలీ మ్యాన్-3’ (The Family Man-3)స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు ప్రకటించింది. నవంబర్ 21న స్ట్రీమ్ కానున్నట్లు ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశారు.
రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో మనోజ్ బాజ్‌పేయి(Manoj Bajpayee) మరోసారి శ్రీకాంత్ తీవారీ పాత్రలో కనిపించబోతుండగా.. ప్రియమణి, షరీబ్ హష్మి, ఆశ్లేష ఠాకూర్, శరద్ ఖేల్కర్, సందీప్ కిషన్, శ్రేయా ధన్వంతరి, అభయ్ వర్మ కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సిరీస్ ఎలా ఉండబోతుందనే విషయంపై దర్శకులు స్పందిస్తూ.. ‘‘ఈ సీజన్‌లో శ్రీకాంత్ టీమ్ ఎదుర్కొనే ప్రమాదాలు మరింత తీవ్రమవుతాయి. అదే సమయంలో ఆయన కుటుంబంలో జరిగే సంఘటనలు కూడా భావోద్వేగంగా ఉంటాయి. శ్రీకాంత్ ఈజ్ బ్యాక్. ఆయన దేశ సరిహద్దుల లోపల, బయట నుంచి వచ్చే బెదిరింపులను, శత్రువులను ఎదుర్కొంటూ ఉంటారు’’ అని చెప్పి అంచనాలను పెంచారు.






