- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ విమర్శలు నన్ను ఎంతో మానసిక ఒత్తిడికి గురి చేశాయి.. డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), ఓం రౌత్ (Om Raut)కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ‘ఆదిపురుష్’(Adipurush).

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), ఓం రౌత్ (Om Raut)కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ‘ఆదిపురుష్’(Adipurush). ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. రామాయణాన్ని తెరపై చూపిస విధానంపై నెటిజన్లు దారుణంగా విమర్శలు చేశారు. అంతేకాకుండా ఓం రౌత్ దొరికితే చంపేస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. అలాగే కొద్ది రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా తప్పించుకున్నాడు. అలాగే ఇండస్ట్రీకి కూడా దూరం అయ్యాడు. ప్రస్తుతం ఓం రౌత్ ఓ నెట్‌ఫ్లిక్స్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘ఇన్‌స్పెక్టర్ జెండె’ స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చి మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటుంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఓం రౌత్ మరోసారి ఆదిపురుష్ సమయంలోని సంఘటనలు గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు.
‘‘తప్పులు జరగడం మన మంచికే. విజయం మనకు ఎక్కువగా నేర్పిస్తుందనిపిస్తుంది. వైఫల్యం మరింత గుఠపారం నేర్పుతుంది. మళ్లీ జరగకుండా ఉండేందుకు జాగ్రత్త పడొచ్చు. ఆదిపురుష్‌పై వచ్చిన విపరీతమైన ట్రోలింగ్, విమర్శలు నన్ను ఎంతో మానసిక ఒత్తిడికి గురి చేశాయి. ఈ ఒక్క సినిమాతో మొత్తం కాన్ఫిడెన్స్ కోల్పోయాను. నా కుటుంబం, స్నేహితులు, సన్నిహిత టీమ్ సభ్యుల సపోర్ట్ వల్లనే కష్టాలను అధిగమించగలిగాను. ఇక ఇప్పుడు ప్రేక్షకుల నమ్మకాన్ని పొందడానికి నేను ఎంతో కష్టపడాలి. త్వరలోనే ఓ మంచి కంటెంట్ ఉన్న సినిమాతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.






